ఫస్ట్ టైమ్ తన ప్రేమను బయట పెట్టిన Raashii Khanna.. అందుకే సన్నగా అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్?

by Dishanational2 |
ఫస్ట్ టైమ్ తన ప్రేమను బయట పెట్టిన Raashii Khanna.. అందుకే సన్నగా అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటి రాశిఖన్నా. తర్వాత జిల్, వెంకీ మామ, పక్కా కమర్షియల్,శ్రీనివాస కళ్యాణం, బెంగాల్ టైగర్, ప్రతిరోజు పండగ, హైపర్, తొలిప్రేమ, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం రాశిఖన్నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా, షాకింగ్ విషయాన్ని వెళ్లడించింది.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్,తమ లవ్ గురించి బయటపెట్టారు. కాగా, తాజాగా రాశిఖన్నా తన ప్రేమను బయట పెట్టింది.ఆమె మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం సింగిల్ గా లేను, నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితోనే డేటింగ్ చేస్తున్నాను.అయితే గతంలో నేను మరో వ్యక్తి ప్రేమలో పీకల్లోతులో మునిగిపోయాను. కానీ ఆ వ్యక్తితో బ్రేకప్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి చాలా బొద్దుగా మారిపోయాను.దాంతో నాకు అవకాశాలు కూడా ఎక్కువగా రాలేదు.

ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నప్పటి నుండి నేనే ఆశ్చర్యపడిపోయేలా చాలా సన్నబడ్డ. చివరికి నన్ను బాగా అర్థం చేసుకునే ఓ వ్యక్తి నాకు దొరికాడు. అందుకే నేను ఎలాగైతే సన్నబడాలి అనుకున్నానో అదే షేప్ లోకి వచ్చాను అంటూ రాశి ఖన్నా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టింది.

Also Read:

Rashi Khanna : ఎద అందాల ఆరబోతతో కవ్విస్తు అగ్గి రాచేస్తున్న రాశి ఖన్నా

Rithu Chowdary : లేలేత అందాలకు అల్లాడిపోతున్న కుర్రకారు..

Next Story