టాలీవుడ్ డైరెక్టర్స్ హీరోయిన్లలో అది మాత్రమే చూస్తారు : Raashi Khanna

by sudharani |
టాలీవుడ్ డైరెక్టర్స్ హీరోయిన్లలో అది మాత్రమే చూస్తారు : Raashi Khanna
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌లు ఇప్పుడు సరైన అవకాశాలు లేక మరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అందులో రాశిఖన్నా ఒకరు. బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ప్రజంట్ బాలీవుడ్‌లో సెటిలైపోయింది. ఇదిలావుంటే.. సౌత్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్‌లు ఇండస్ట్రీ మారగానే అన్నం పెట్టిన టాలీవుడ్‌ను దూషించడం మొదలుపెట్టారు. అనవసరంగా తెలుగు పరిశ్రమపై నోరు పారేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలా నోరుజారిన వారిలో ఇలియానా, రకుల్ ప్రీత్‌సింగ్, రష్మిక ఉన్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లోకి రాశిఖన్నా కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ‘సౌత్ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లు కేవలం బొద్దుగా ఉన్న హీరోయిన్లనే ఎంకరేజ్ చేస్తారు’ అని కామెంట్ చేసింది. దీంతో మిగతా హీరోయిన్స్‌లాగే రాశి కూడా విశ్వాసం కోల్పోయిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Read More: నా పిరికి తనమే నన్ను ఇలా మార్చేసింది.. రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story