మరో బంపర్ ఆఫర్ అందుకున్న రాషా థడానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బిగ్‌సర్‌ప్రైజ్

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ (Rasha Thadani)త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

మరో బంపర్ ఆఫర్ అందుకున్న రాషా థడానీ..  ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బిగ్‌సర్‌ప్రైజ్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ (Rasha Thadani)త్వరలో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు జంటగా ఆమె నటించనున్న తొలి తెలుగు సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై ఉండగా, విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే రాషా థడానీకి మరో క్రేజీ ఆఫర్ దక్కింది. బాలీవుడ్‌లో ఆమె కొత్త సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘లైకీ లైకా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అభయ్ వర్మ హీరోగా నటిస్తుండగా, రాషా థడానీ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ రొమాంటిక్ డ్రామాను సౌరభ్ గుప్తా దర్శకత్వం వహించనుండగా, ఫాంటమ్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.ఇటీవల విడుదలైన ‘లైకీ లైకా’ (Laikey Laikaa)ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రేమ, హింస రెండూ కలిసిన కథను సూచించేలా రూపొందించిన ఈ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ బూట్లపై రక్తపు మరకలు కనిపిస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇది సాధారణ రొమాంటిక్ కథ కాదని, తీవ్రమైన సంఘర్షణలతో కూడిన కథను ఈ సినిమా చెప్పబోతోందన్న సంకేతాలు ఇస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ‘లైకీ లైకా’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఒక సినిమా విడుదల కాకముందే మరో భారీ ఆఫర్ దక్కించుకోవడం రాషా థడానీ క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.

Next Story