ఛీ..ఛీ ప్రైవేట్ పార్ట్‌పై సిలువను పెట్టుకుని ర్యాపర్ బోల్డ్ సాంగ్.. నీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

ఇటీవల కాలంలో చాలామంది ఫేమస్ అయ్యేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు.

ఛీ..ఛీ ప్రైవేట్ పార్ట్‌పై సిలువను పెట్టుకుని ర్యాపర్ బోల్డ్ సాంగ్.. నీకేం పోయేకాలం వచ్చిందంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది ఫేమస్ అయ్యేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. తన పాపులారిటీ పెంచుకుందామనుకుని విమర్శల పాలవుతున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం స్టేజ్‌పై నోరు జారుతూ బూతులు మాట్లాడేస్తూ ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఇటీవల ఎన్నో కాంట్రవర్సీలు ఇండస్ట్రీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ర్యాపర్ జెనెసిస్ యాస్మిన్ మోహన్ రాజ్(Genesis Yasmin Mohan Raj) కూడా ఫేమ్ తెచ్చుకుందామనుకుని విమర్శల పాలైంది. అసలు విషయంలోకి వెళితే.. ఆమె ఇటీవల ట్రూ బ్లూ పేరుతో ఒక సాంగ్ చేసింది. అందులో మహిళల ఆవేదనను, వారికి ఉండే కోరికలను చాలా పచ్చిగానే చెప్పింది.

అయితే ఇందులో యాస్మిన్ హిందూ, క్రిస్టియన్(Christian) మతాలను అవమానించేలా ప్రవర్తించింది. ఆమె గెటప్ కూడా చాలా దారుణంగా ఉంది. కాళీ మాతకు ప్రతిరూపంగా ఉన్న బ్లూ కలర్‌ను ఒంటి నిండా పూసుకొని ఆమె రూపాన్ని రీ క్రియేట్ చేయాలని చూసింది. బంగారు, నగలు, ఎరుపు బింది, ధరించి రెచ్చగొట్టే నృత్య కదలికలను ప్రదర్శిస్తూ ఈ పాటను చిత్రీకరించారు. అంతటితో ఊరుకోకుండా క్రిస్టియన్స్ ఎంతో పవిత్రంగా భావించే సిలువను పట్టుకుని నాలుకతో నాకుతూ, ప్రైవేట్ పార్ట్ వద్ద సిలువను చాలా నీచంగా దేవుళ్లను అవమానించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు కళ, క్రియేటివిటీ పేరుతో దేవుళ్లను అవమానించడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు. దైవత్వానికి, లైంగికతను జోడించి గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్న జెనెసిస్‌ను బ్యాన్ చేయడంతో పాటు కఠిర చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఛీఛీ, వ్యూస్, లైక్స్ కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అంటూ సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. వీడియో

instagram link

Next Story