‘కాంతార: చాప్టర్1’ సినిమాపై రణ్‌వీర్ సింగ్ వివాదాస్పద కామెంట్స్.. క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్ల డిమాండ్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

‘కాంతార: చాప్టర్1’ సినిమాపై రణ్‌వీర్ సింగ్ వివాదాస్పద కామెంట్స్.. క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్ల డిమాండ్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: చాప్టర్1’(Kantara: Chapter 1) కూడా బాక్సాఫీసు వద్ద సంచలన రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటుగా.. సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ రెండు చిత్రాల్లో పంజురీ దేవపై తెరకెక్కించిన సీన్లు హైలెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా కొన్ని సీన్స్‌కి ప్రేక్షకుల్లో అమ్మవారు కూడా పూనడం గమనార్హం. థియేటర్స్‌లో అలా చేసిన వారెందరో ఉన్నారు. అలాంటి సినిమాపై ఓ హీరో వివాదాస్పద కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా, గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా(IFFI) ముగింపు కార్యక్రమంలో రణ్‌వీర్ (Ranveer Singh)చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి అద్భుతంగా చేశారని ప్రశంసలు కురిపించారు. అలాగే హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయని అన్నారు. అంతటితో ఊరుకోకుండా.. స్టేజ్‌పై కాంతారలో ఎంతో వైరల్ అయిన ఓ అనే శబ్దాన్ని స్టేజ్‌పై చేసి చూపించడంతో పాటు ఈ సీన్‌పై కామెడీ చేయడంతో ట్రోల్స్‌కు గురవుతున్నాడు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ కూడా కొంత అసౌకర్యంగా ఫీల్ అయినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన కన్నడిగులు వెంటనే ‘కాంతార’ టీమ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ విడుదల అడ్డుకుంటామని హెచ్చిరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కాంతార రిలీజ్ సమయంతో థియేటర్‌లో దైవంలాగా అరవకండి, నా గెటప్‌లో రావడం లాంటివి చేయకండి అని సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పనిని స్టేజ్‌పై రణ్‌వీర్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ ఎలా స్పందిస్తాడనేది అందరిలో ఆసక్తిగా మారింది. కాగా.. రణ్‌వీర్ సింగ్ త్వరలో ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇన్నాళ్లూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆమె ఈ చిత్రంతో హీరోయిన్‌గా మారుతుండటం విశేషం. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలోనే రణ్‌వీర్ వివాదంలో చిక్కుకోవడంతో అసలు రిలీజ్ అవుతుందా? వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LINK

Next Story