Don3 నుంచి అనౌన్స్‌మెంట్‌ వీడియో.. రణ్‌వీర్ డైలాగ్ వింటే గూస్‌బంప్సే!

by Dishanational2 |
Don3  నుంచి అనౌన్స్‌మెంట్‌ వీడియో.. రణ్‌వీర్ డైలాగ్ వింటే గూస్‌బంప్సే!
X

దిశ, సినిమా: రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్‌ అక్తర్‌ కాంబోలో వస్తున్న ‘డాన్ 3’నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వెలువడింది. ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి పార్ట్ అమితాబ్ నటించగా సెకండ్ పార్టులో షారుఖ్ అదరగొట్టాడు. కాగా ఈ మూడోపార్టు కోసం రణ్‌వీర్‌ను ఎంచుకున్న ఫర్హాన్.. కొత్త శకం ప్రారంభం అంటూ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేశాడు. అందులో రణ్‌వీర్‌ డాన్‌ మేకోవర్‌ను చూపించగా.. లైటర్‌తో సిగర్‌ వెలిగించుకుంటూ డాన్‌ అని చెప్పడం గ్లింప్స్‌కే హైలేట్‌లా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతుండగా డాన్ అభిమానులు ఈ అప్ డేట్‌తో ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి 2025లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారట. చాలా గ్యాప్ తర్వాత ఫర్హాన్‌ మెగా ఫోన్‌ పట్టిన మూవీని రితేష్ సిద్వాని, ఫర్హన్ అక్తర్‌ సంయుక్తంగా నిర్మిస్తు్న్నారు.


Next Story

Most Viewed