- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిష్ త్రిపాఠి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్..
ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన బెస్ట్ సెల్లర్ నవల ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా’ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ శివుడిగా నటించనున్నట్లు టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ‘ధురంధర్’తో బాక్సాఫీసును షేక్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టి పలు సంచలన రికార్డు సాధించింది. ఇక ఇప్పుడు రణవీర్ ఒక భారీ పౌరాణిక ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన బెస్ట్ సెల్లర్ నవల ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా’ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ శివుడిగా నటించనున్నట్లు టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనన్యా బిర్లాకు చెందిన బిర్లా స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో మూడు భాగాలుగా తెరకెక్కించనుంది. రణవీర్ సింగ్ కేవలం నటుడిగానే కాకుండా, ఈ ప్రాజెక్టులో క్రియేటివ్ పార్ట్‌నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారట. అయితే శివుడి పాత్ర కోసం రణవీర్ భారీ శారీరక మార్పులతో పాటు, ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, భారతీయ వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోందని తెలుస్తోంది.
అనన్యా బిర్లా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ భారీ చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా, ది సీక్రెట్ ఆఫ్ ది నాగాస్, ది ఓత్ ఆఫ్ ది వాయుపుత్రాస్ అనే మూడు నవలల ఆధారంగా ఈ మూడు భాగాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. రణవీర్, అనన్యా బిర్లా స్వయంగా రైటింగ్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనేది ప్రకటించనున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, అత్యాధునిక VFX హంగులతో ఈ సినిమాను IMAX 3D ఫార్మాట్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా షూటింగ్ 2027 చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి భాగాన్ని 2028లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు.






