- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సెట్స్‌లో రణ్‌వీర్ సింగ్ ఎంట్రీ.. చర్చనీయాంశంగా మారిన ఫొటోలు
కింగ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సెట్‌లోకి ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, గ్లామర్ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సెట్‌లోకి ఒక స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనే బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్. తన భార్య దీపికా పదుకొణెకు మద్దతుగా రణవీర్ సింగ్ ‘కింగ్’ సెట్‌లోకి అడుగుపెట్టారు. కేవలం ఆయన మాత్రమే కాకుండా, తన ముద్దుల కూతురు దువాను కూడా వెంటపెట్టుకొని రావడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. షూటింగ్ విరామ సమయంలో రణవీర్ ఎంతో సరదాగా గడిపారు. బ్లాక్ టీ షర్ట్, కార్గో ప్యాంట్, సన్ గ్లాసెస్, బీనీ టోపీతో చాలా స్టైలిష్‌గా కనిపించిన రణవీర్‌ను చూసి ఫ్యాన్స్ ఎగబడ్డారు.
రణవీర్ కూడా ఎంతో ఓపికగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. షారుఖ్ ఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయం కాబోతోంది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పంచుకోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇటీవల ‘కింగ్’ షూటింగ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. దీనిపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి లీకుల వల్ల సినిమా సస్పెన్స్ దెబ్బతింటుందని, ఫోటోలను వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేయడం ఆపేశారు. రణవీర్ సెట్‌లోకి వచ్చిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భార్య కోసం వెళ్లిన రణ్ వీర్‌పై మరికొందరు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.






