దీపిక అపార్ట్‌మెంట్‌లో కీర్తి సురేష్.. రణ్‌వీర్‌తో కలిసి రచ్చ రచ్చ: వీడియో వైరల్

by Disha Web Desk 10 |
దీపిక అపార్ట్‌మెంట్‌లో కీర్తి సురేష్.. రణ్‌వీర్‌తో కలిసి రచ్చ రచ్చ: వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, మహానటి కీర్తి సురేష్‌లకు సంబంధించిన ఓ ఫైట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు కొటాక్ బ్యాంక్‌కు సంబంధించిన ఓ యాడ్‌లో వీరిద్దరూ కలిసి మొదటిసారి నటించగా.. ఇద్దరూ బ్యూటీఫుల్ లుక్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేశారు. కీర్తి బ్లాక్ కలర్ గౌను, డైమండ్ ఇయర్ రింగ్స్, పోనీటైల్‌ జుట్టుతో కాస్త బోల్డ్‌గా కనిపించగా రణ్‌‌వీర్ రెడ్ కలర్ సూట్‌లో అందంగా కనిపించాడు. ఇక ఈ ప్రకటనలో వీరిద్దరూ ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కపుల్స్‌గా చూపించగా.. ఫోన్‌‌లో వచ్చిన కొటాక్ ఫైనాన్స్‌ మెసేజ్ చదివేందుకు ఒకరితోఒకరు పోటీపడ్డారు. ఇళ్లంతా పరిగెత్తుతూ అద్భుతమైన విన్యాసాలు చేశారు. ఈ ఫన్నీ వీడియోలో కీర్తిని ‘బేబీ’ అంటూ హీరో కాకాపడుతున్నట్లు చూపించగా ఇద్దరిమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

Also Read..

రామ్ చరణ్‌ను ఇంట్లో అలా పిలుస్తారా? కొత్తపేరు బయటపెట్టిన నిహారిక

ఆ సీన్‌లో కామాన్ని క్రంటోల్ చేసుకోలేకపోయా.. మొరటుగా ఉన్నానని తిట్టారు


Next Story

Most Viewed