- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rani Mukerji: యువ దర్శకులకు ఆ ఆకలి ఎక్కువ.. అందుకే వాళ్లతో పనిచేయడాన్ని ఆస్వాదిస్తా
ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యువ దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాలపై ఓపెన్ అయింది రాణి ముఖర్జీ.

దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన యువ దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాలపై ఓపెన్ అయింది రాణి ముఖర్జీ. అంతేకాదు వారు తన కెరీర్‌ని ఎలా తీర్చిదిద్దారో కూడా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘కొత్త డైరెక్టర్లకు ఉమ్మడి స్వభావం ఎక్కువగా ఉంటుంది. వారంతా పరిశ్రమలో అతిపెద్ద ముద్ర వేయాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. పనిపట్ల అత్యంత ఆకలితో ఉంటారు. నేను వాళ్లపట్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. వాళ్ల పనితీరును నేను చాలా ఇష్టపడతాను. కొత్త జనరేషన్ సృజనాత్మక శక్తిని ఆస్వాదించడాన్ని నా అదృష్టంగా భావిస్తాను. నా కెరీర్ ‘కుచ్ కుచ్ హోతా హై’ కరణ్ జోహార్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత షాద్ అలీ మొదటి చిత్రం ‘సాథియా’లోనూ పనిచేశాను. ఆ సమయంలో వాళ్ల క్రియేటివిటీ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన ఆలోచనలను కలిగివున్న యువకులను చూస్తే ముచ్చటేసింది’ అంటూ పలు విషయాలను గుర్తుచేసుకుంది.






