- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురు ఖాన్‌ల గుట్టు విప్పిన రాణి ముఖర్జీ.. ఆసక్తికర కామెంట్స్ వైరల్!
ముగ్గురు స్టార్స్‌తో పనిచేసిన ఏకైక నటి రాణి ముఖర్జీ(Rani Mukherjee).

దిశ, సినిమా: ముగ్గురు స్టార్స్‌తో పనిచేసిన ఏకైక నటి రాణి ముఖర్జీ(Rani Mukherjee). తన కెరీర్‌లో షారుఖ్ ఖాన్(Shahrukh Khan), ఆమిర్ ఖాన్(Aamir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan)లతో కలిసి నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణి ముఖర్జీ ముగ్గురు స్టార్స్‌తో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ముగ్గురు స్టార్స్ సెట్స్‌లో ఎలా ఉంటారో, వారి నటన వెనుక ఉన్న రహస్యాలేమిటో వివరించారు. సల్మాన్ ఖాన్ గురించి రాణి ముఖర్జీ చెబుతూ.. ఆయన సెట్‌లోకి రాగానే చాలా క్యాజువల్ (బిందాస్)గా కనిపిస్తారని, కానీ ఆయన కష్టం ఎవరికీ కనిపించదని అన్నారు. "సల్మాన్ తన పని కోసం ఎంత కష్టపడతారో ఎవరికీ తెలియనివ్వరు. ఆయన చాలా స్వాగ్‌తో, అటిట్యూడ్‌తో కనిపిస్తారు. కానీ సీన్ల గురించి మాట్లాడేటప్పుడు, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆయన ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. తన వర్క్ జోన్‌లోకి ఎవరినీ రానివ్వకుండానే ఆయన తన పని పూర్తి చేస్తారు" అని ఆమె కొనియాడారు.
షారుఖ్ ఖాన్ గురించి చెబుతూ.. ఆయన సెట్స్‌లో ఎంతో ఎనర్జీతో ఉంటారని, ముఖ్యంగా తనతో నటించే మహిళా నటులను ఎంతో గౌరవంగా, జాగ్రత్తగా చూసుకుంటారని రాణి గుర్తు చేసుకున్నారు. ఇక ఆమిర్ ఖాన్ అంకితభావం గురించి మాట్లాడుతూ.. ప్రతి షాట్ కోసం ఆయన ఇచ్చే బెస్ట్ అవుట్‌పుట్ తనను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. ఈ ముగ్గురు దిగ్గజాలను తాను సమానంగా ప్రేమిస్తానని రాణి ముఖర్జీ ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా.. ఆమె సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘మర్దాని-3’చిత్రంతో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమా మూడు నెలల వ్యవధిలో రహస్యంగా అదృశ్యమైన 93 మంది యువతు కేసును ఛేధించే కథాంశంతో వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది.






