‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్.. సమంతతో పాటు మరో సెన్సేషనల్ హీరోయిన్?

by Gantepaka Srikanth |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్ చరణ్ - సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్.. సమంతతో పాటు మరో సెన్సేషనల్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్ చరణ్ - సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మరోసారి చరణ్‌కు జోడీగా సమంతను ఫిక్స్ చేశాడట దర్శకుడు సుకుమార్. సామ్‌(Samantha)తో పాటు మరో సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmita Mandanna) కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్‌తో చరణ్, పుష్ప-2తో సుకుమార్ గ్లోబల్ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో #RC16లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటంగ్ పూర్తయిన తర్వాత చరణ్ - సుకుమార్ సినిమా పట్టాలెక్కనున్నది. మరోవైపు.. ఇటీవల చరణ్ నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రం(Game Changer Movie) తీవ్రంగా నిరాశపర్చింది. అంతకుముందు ఆచార్య కూడా బాధపెట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న చరణ్‌కు బుచ్చిబాబు, సుక్కు తప్పకుండా హిట్టిస్తారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.

Next Story