- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’ రన్‌టైమ్ రివీల్ చేసిన రణ్‌బీర్ కపూర్.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఈ సినిమా రన్‌టైమ్‌కు సంబంధించి రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, సినిమా: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. ఇక ఇటీవల విడుదలైన రామ గ్లింప్స్ అంచనాలను మరింత పెంచాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా రన్‌టైమ్‌కు సంబంధించి రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా సినిమాలు రెండున్నర లేదా మూడు గంటలు ఉంటాయి. కానీ, ‘రామాయణ’ సినిమా ఏకంగా 6 గంటల పాటు ఉండబోతోందని రణ్‌బీర్ వెల్లడించారు.
రామాయణం అనేది ఒక అద్భుతమైన కావ్యం కాబట్టి, అందులోని ఏ ఒక్క ముఖ్యమైన ఘట్టాన్ని కూడా వదలకుండా వెండితెరపై చూపించాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉందట. అందుకే విజువల్స్ అన్నీ కలిపి దాదాపు 6 గంటల ఎపిక్ అనుభూతిని ఇస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఈ 6 గంటల సినిమా ఒకేసారి థియేటర్లలో చూపిస్తారా? లేక రెండు భాగాలుగా విడుదల చేస్తారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రణ్‌బీర్ మాట్లాడిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవ్వడంతో సినిమా ప్రేమికులు షాక్ అవుతున్నారు. ఇంత భారీ నిడివితో రామాయణాన్ని చూపిస్తే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవం లభిస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా యష్, సన్నీ డియోల్, అమితాబ్ బచ్చన్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ నటిస్తుండటం సినిమాకు మరో పెద్ద ప్లస్. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా మొదటి రాబోతుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రాబోతుంది.






