Ranbir Kapoor: ఆ రోజు దీపికతో కలిసి తాగాను: ఓపెన్ అయిన స్టార్ హీరో

by Disha Web Desk 10 |
Ranbir Kapoor: ఆ రోజు దీపికతో కలిసి తాగాను: ఓపెన్ అయిన స్టార్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ సహనటి దీపికతో కలిసి బంగు తాగానంటున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘తూ ఝూఠీ మై మక్కర్’ మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో.. తాజా సమావేశంలో అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘2013లో వచ్చిన ‘యే జవానీ హై దివానీ’లో ఆదిత్య రాయ్ కపూర్, దీపికా పదుకొణె, కల్కి కొచ్లిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలోని ‘బలం పిచికారి’ పాట బిగ్ హిట్ అయింది. దాపుగా ఎనిమిది రోజుల పాటు పాటను షూట్ చేశాం. అయితే ఓ ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండటంతో డ్యాన్స్ చేయడం కష్టంగా ఉండేది. దీంతో నేను, ఆదిత్య, కల్కి, దీపిక అందరం కలిసి బంగు తాగేవాళ్లం. మిగతా డ్యాన్సర్లకు కనిపించకుండా దూరంగా ఈ డ్రింక్‌ను దాచిపెట్టేవాళ్లం. ఈ విషయం ఎవరికి తెలియనివ్వలేదు’ అంటూ సరదాగా గుర్తుచేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి : గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ విడిపోవడానికి ఆ అమ్మాయే కారణమా?

Next Story

Most Viewed