- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిస్టరీ క్రియేట్ చేసిన రణ్‌బీర్ కపూర్.. టైమ్ మ్యాగజైన్ గ్లోబల్ పవర్ లిస్ట్‌లో చోటు!
‘2026 ప్రపంచవ్యాప్త అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ చోటు దక్కించుకున్నారు

దిశ, సినిమా: ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘2026 ప్రపంచవ్యాప్త అత్యంత ప్రభావశీలురైన 100 మంది’ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో స్థానం పొందిన ఏకైక భారతీయ నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రీతిలో గ్లోబల్ ఐకాన్స్‌తో కలిసి రణ్‌బీర్ ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.
రణ్‌బీర్ కపూర్ సాధించిన అరుదైన గౌరవం:
ప్రతి ఏటా టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మార్పులు తెస్తున్న 100 మందిని గుర్తిస్తుంది. 2026 సంవత్సరానికి గానూ ఎంపికైన ఈ జాబితాలో రణ్‌బీర్ నిలవడం ఆయన క్రేజ్‌కు నిదర్శనం. ముఖ్యంగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభావం, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రామాయణం’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఒక నటుడిగా రణ్‌బీర్ తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తున్నారనే అంశాన్ని టైమ్ మ్యాగజైన్ ప్రస్తావించింది. రణ్‌బీర్ కపూర్ గురించి ఈ మ్యాగజైన్‌లో ప్రొఫైల్ రాసిన నటుడు ఆయుష్మాన్ ఖురానా.. ఆయనను ఒక ‘స్టోరీ టెల్లర్’గా అభివర్ణించారు. బాక్సాఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా, తన నటనతో ప్రేక్షకుల ఎమోషన్స్‌ను పట్టుకోగల సత్తా రణ్‌బీర్ సొంతమని కొనియాడారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిని, కథలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ఒక వారధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో రణ్‌బీర్ కపూర్‌తో పాటు భారత్‌కు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్,యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీల్ మోహన్,న్యూయార్క్ సిటీ మేయర్ న్యూయార్క్ సిటీ మేయర్,ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాలకు చోటు దక్కింది. ఇక ఈ జాబితాలో కేవలం సినీ, సాంకేతిక రంగాల వారే కాకుండా ప్రపంచాన్ని శాసిస్తున్న రాజకీయ నాయకులకు కూడా చోటు దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వంటి అగ్రనేతలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీరితో పాటు ఆధ్యాత్మిక గురువు పోప్ లియో కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి బడా నేతలు, బిజినెస్ దిగ్గజాల మధ్య ఒక భారతీయ నటుడిగా రణ్‌బీర్ కపూర్ పేరు వినిపించడం సినీ అభిమానులకు పండగ లాంటి వార్త.






