National Awards కాంట్రవర్సీపై స్పందించిన Rana Daggubati.. Allu Arjun ను తిట్టారా.. పొగిడారా..? ఆ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2023-09-04 14:46:41  IST  )

జాతీయ అవార్డ్స్‌లో ఏకంగా 11 అవార్డులను కొల్లగొట్టి తెలుగు సినిమాలు సత్తా చాటిన విషయం తెలిసిందే.

National Awards కాంట్రవర్సీపై స్పందించిన Rana Daggubati.. Allu Arjun ను తిట్టారా.. పొగిడారా..? ఆ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ అవార్డ్స్‌లో ఏకంగా 11 అవార్డులను కొల్లగొట్టి తెలుగు సినిమాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తమ జాతీయ నటుడిగా ‘పుష్ప’ సినిమాకు గాను అల్లు అర్జున్ కైవసం చేసుకున్నాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. హీరో నాని సైతం తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘జై భీమ్’ అని రాసి దాని పక్కన హాట్ బ్రేకింగ్ ఎమోజీ పోస్ట్ చేశాడు. దీంతో జాతీయ అవార్డుల ప్రకటనపై నెట్టింట మరింత నెగిటివ్ టాక్ ఏర్పడింది. లాయర్ పాత్ర చేసిన సూర్యకు ఉత్తమ నటుడు అవార్డు రాకుండా స్మగ్లర్‌ పాత్రకు రావడం ఏంటని మండిపడ్డారు నెటిజన్లు. అయితే ఈ విమర్శలపై తాజాగా దగ్గుబాటి రానా స్పందించాడు.

హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన రానాకు జాతీయ అవార్డుల కాంట్రవర్శీపై మాట్లాడమని మీడియా కోరగా ‘‘సినిమాలు చూడటంలో అందరి కోణం ఒకలా ఉండదు. నాకు నచ్చే సినిమాలు మీకు నచ్చకపోవచ్చు. అలాగే మీకు నచ్చేవి నాకు నచ్చకపోవచ్చు. జై భీమ్ సినిమాకు కనీసం ఒక్క అవార్డు అయిన వస్తుందని అందరూ భావించారు. కానీ ఏ విభాగంలో కూడా ఆ మూవీకి అవార్డు రాలేదు. దీంతో తమ అభిప్రాయం తెలియజేస్తూ కొందరు ట్వీట్ చేస్తే.. మరికొందరు దాన్ని కాంట్రవర్శి చేశారు. అంతే కానీ.. నటుట మధ్య మాత్రం ఎలాంటి వివాదాలు ఉండవు’’ అంటూ రానా స్పందించాడు.

ఇవి కూడా చదవండి : చిరంజీవి, ప్రభాస్‌ను క్రాస్ చేసిన సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆమె వెనకే..

Next Story