ఆ ఇద్దరికి నా క్షమాపణలు.. దగ్గుబాటి రానా ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
ఆ ఇద్దరికి నా క్షమాపణలు.. దగ్గుబాటి రానా ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అభిలాష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు-24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించారు టీం. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా, నాచురల్ స్టార్ నాని అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా, నాని ఈ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇందులో రానా.. దుల్కర్ గురించి మాట్లాడుతూ ఓ స్టార్ హీరోయిన్‌పై నెగిటివ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. డైరెక్ట్‌గా హీరోయిన్ పేరు చెప్పనప్పటికీ ఆమె సోనమ్ కపూర్ అని అందరికీ తెలుసు. ఇక సోనమ్‌పై చేసిన కామెంట్స్ తప్పుదోవ పడుతుండడంతో ట్విట్టర్ వేదికగా స్పందించాడు రానా. ఈ మేరకు ‘‘నేను, దుల్కర్, సోనమ్ మంచి స్నేహితులం. మేము తరచుగా కలుస్తూ.. సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ, నేను చేసిన వ్యాఖ్యలు కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నందుకు నేను చింతిస్తున్నాను. ఏది ఏమైనా సోనమ్, దుల్కర్‌కు నా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ అపార్థాలు తొలగిపోతాయని నేను అనుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు.

Next Story

Most Viewed