వెంకీ కాలర్ పట్టుకున్న రానా.. రెండు ఫ్యామిలీస్ మధ్య వార్..!

by Disha Web Desk |
వెంకీ కాలర్ పట్టుకున్న రానా..  రెండు ఫ్యామిలీస్ మధ్య వార్..!
X

దిశ, సినిమా: 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌‌లో‌ నటించడం వల్ల కెరీర్‌లో‌నే సరికొత్త అనుభూతి పొందానంటున్నాడు వెంకటేష్. అన్న కొడుకు, నటుడు రానాతో కలిసి నటించిన ఈ సిరీస్ మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్‌‌లో పాల్గొంటున్న వెంకీ.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఇలాంటి ఇంట్రెస్టింగ్ సిరీస్‌లో రానాతో కలిసి పనిచేయడం సరికొత్తగా ఉంది. ఒకరకమైన థ్రిల్లింగ్‌గా అనిపించింది. నేను పోషించిన నాగా క్యారెక్టర్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. మొత్తానికి ఇలాంటి స్టోరీలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ చేయడం సవాల్ లాంటిదే' అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలావుంటే.. ఇటీవల 'నీకు నా బ్యాక్ గ్రౌండ్ తెలుసా? ఇప్పుడే బుల్లెట్ దింపి వచ్చాను. నా జీవితంలో చెడు చేసినా మంచి చేసినా నా కుటుంబం కోసమే' అంటూ ఈ తండ్రీకొడుకుల మధ్యసాగే సంభాషణలు సిరీస్‌పై భారీ అంచనాలు పెంచేయగా 'బాబాయ్.. అబ్బాయ్ ఇరగదీశారు'.. 'కుటుంబం మధ్య వార్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది' అని పొగిడేస్తున్న నెటిజన్లు సిరీస్ పక్కా హిట్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Vijay Devarakonda : ఆ ఒక్కటే పెండింగ్‌.. త్వరలోనే నెరవేరుస్తానంటున్న .. విజయ్ దేవరకొండ

Next Story

Most Viewed