'ఆనందరావు అడ్వెంచర్స్' ఫస్ట్ లుక్ రివీల్ చేసిన Rana, Krish!

by Disha Web Desk 7 |
ఆనందరావు అడ్వెంచర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన Rana, Krish!
X

దిశ, సినిమా : సుహాన్ హీరోగా రామ్ పసుపులేటి తెరకెక్కించబోతున్న చిత్ర ప్రారంభ కార్యక్రమం బుధవారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ 'ఆనందరావు అడ్వెంచర్స్'తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా క్రిష్ స్క్రిప్ట్‌‌ను టీమ్‌కి అందజేశాడు. ఇక Xappie స్టూడియోస్ నంబర్ 4గా, స్ట్రీమ్లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్న, సురేష్ కోతింటి నిర్మించనున్నారు.

ఇక ఈ పోస్టర్‌‌లో సుహాస్ తన తలపై కిరీటంతో ఫన్నీ అవతార్‌‌లో కనిపిస్తుండగా స్వర్గం నుంచి భూమికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఫీడింగ్ బాటిల్‌‌ని మోస్తున్నట్లు కనిపించాడు. 'ఊరు స్వర్గంలా కనువిందు చేస్తోంది. సుహాస్ ముఖంలో సంతృప్తి. టైటిల్ లాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. మంచి కథతో మీముందుకు వస్తున్నాం. మాకు స్పూర్తిగా నిలిచిన రానా ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. చిల్డ్రన్ ఫాంటసీ కథతో వస్తున్న చిత్రం అందరినీ అలరిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం' అని దర్శకనిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నాడు.

ఇవి కూడా చదవండి : 'ATM' మిమ్మల్ని టెన్షన్ పెడుతూనే న‌వ్విస్తుంది: దిల్ రాజు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed