అలాంటి పోస్ట్‌తో బిగ్ షాకిచ్చిన రానా దగ్గుబాటి.. ఊహించలేదంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-11 15:04:29  IST  )

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

అలాంటి పోస్ట్‌తో బిగ్ షాకిచ్చిన రానా దగ్గుబాటి.. ఊహించలేదంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వరుస సినిమాలతో హిట్ అందుకుంటూ నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి నిర్మాణంలో ‘డార్క్ చాక్లెట్’(Dark chocolate) రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇక ఇందులో యజ్ఞ అనే అబ్బాయి, ఓ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథే ఈ చిత్రం. కానీ ఇందులో అన్ని బూతు డైలాగ్స్ ఉండటం గమనార్హం. కొన్నింటిని సెన్సార్‌లో కట్ చేసినప్పటికీ చాలా దారుణమైన బూతులు ఉన్నాయి.

‘ఏ’ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా కేవలం పెద్దల కోసమే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ చివర్లో అక్టోబర్ 31, నవంబర్ 14, డిసెంబర్ 5 ఈ మూడు తేదీల్లో ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయమంటారో ప్రేక్షకులను ఎంచుకోమన్నారు. ఇక ఈ టీజర్ చూసిన నెటిజన్లు రానా ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తాడని అస్సలు ఊహించలేదంటూ షాక్ అవుతున్నారు. ‘జానర్ అడగొద్దు మాకూడా తెలియదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతుండగా.. విశ్వ దేవ్(Vishva Dev), బింధు మాధవి జంటగా నటిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story