కోలీవుడ్ డైరెక్టర్‌తో చేతులు కలిపిన రానా దగ్గుబాటి.. ‘నీలిర’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-16 07:53:53  IST  )

ఈలం కథను మెయిన్ స్ట్రీమ్ ప్రేక్షకులకు అందించడం నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరి హృదయాలతో నిర్మించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

కోలీవుడ్ డైరెక్టర్‌తో చేతులు కలిపిన రానా దగ్గుబాటి..  ‘నీలిర’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రస్తుతం కెరీర్ పరంగా గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆయన, 'హనీ' వంటి హారర్ థ్రిల్లర్ తర్వాత ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ కథతో ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్వకుడిగా రాణిస్తున్న కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో, రానా దగ్గుబాటి నిర్మాణంలో రాబోతున్న ‘నీలిర’ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక యుద్ధ బాలుడి చేదు జ్ఞాపకాల ఆధారంగా ఈ సినిమాను సోమేథరన్ తెరకెక్కించారు. శ్రీలంకలోని 'ఈలం' నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ జర్నీని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా, స్టోన్ బెంచ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, మానవత్వానికి సంబంధించిన ఒక లోతైన కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు.

తాజాాగా, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ కార్తీక్ సుబ్బరాజు ఎమోషనల్ అయ్యారు. "ఈలం కథను మెయిన్ స్ట్రీమ్ ప్రేక్షకులకు అందించడం నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరి హృదయాలతో నిర్మించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా కలని నిజం చేయడానికి సహకరించిన రానాకు థాంక్స్" అని ఆయన పేర్కొన్నారు. నవీన్ చంద్ర నటన ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3, 2026న ‘నీలిర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, యుద్ధం మిగిల్చిన గాయాలను, జ్ఞాపకాలను తెరపై ఎలా ఆవిష్కరించబోతుందో చూడాలి. నవీన్ చంద్ర మరోసారి తన నటనతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నా కల నిజమైనట్లుగా అనిపిస్తోంది.. ‘వృషకర్మ’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన చైతూ

Next Story