- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!
టాలీవుడ్ హీరోలు అభిమానులకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోలు అభిమానులకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతున్నారు. కొందరు పెళ్లితో బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతుంటే.. మరికొందరు మాత్రం తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నారు. కానీ అధికారికంగా ప్రకటించడంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ భార్య రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తనకు కవలలు పుడుతున్నట్లు చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ బిడ్డలు పుట్టినప్పటికీ కొందరు.. వారి ముఖాన్ని చూపించేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(rana daggubati) తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో ఆయన భార్య మిహిక తల్లి కాబోతున్న ఓ వార్త వచ్చినప్పటికీ.. ఈ జంట వాటిని కొట్టిపారేసింది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి మిహిక(miheeka), రానా తల్లిదండ్రులు కాబోతున్నట్లు టాక్. ఓ మంచి రోజు ఈ విషయాన్ని వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ.. ఈ విషయం తెలుసుకున్న వారు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రానా తండ్రి కాబోతున్నాడా? లేదా అనేది తెలియాలంటే అధికారికంగా స్పందిస్తే కానీ స్పష్టత రాదు.






