- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యంతో పట్టుబడిన రమ్యకృష్ణ.. మొత్తానికి వాళ్లకు దొరికిపోయిందిగా
తాజాగా మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: తాజాగా మంత్రి రోజాపై టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నటి రమ్యకృష్ణ స్పందిస్తూ తన స్నేహితురాలిపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘మంత్రి రోజాని బండారు సత్యనారాయణ అసభ్యకరంగా దూషించడం దారుణం. మన దేశంలో మాత్రమే భారతమాతకు జై అని గర్వంగా చెబుతాం. ఇలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా? అతన్ని క్షమించకూడదు’ అని ఫైర్ అయింది. దీంతో రోజాకు సపోర్ట్ చేస్తున్న రమ్యకృష్ణను టీడీపీ నాయకులు టార్గెట్ చేశారు. ఆమెకు సంబంధించిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ‘చెన్నైలో లిక్కర్ అమ్మకాలు లేకపోవడంతో.. రమ్యకృష్ణ మహాబలిపురం నుంచి లిక్కర్ కొనుగోలు చేసి తెచ్చుకుంటుంది’ అనే వీడియోను ట్రెండ్‌లోకి తెస్తూ.. ఈ విధంగా ఆమె పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story






