55 ఏళ్ల వ‌య‌సులో ఐటెం సాంగ్స్ చేయ‌నున్న తెలుగు హీరోయిన్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:43:06  IST  )

Ramya krishna 55 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

55 ఏళ్ల వ‌య‌సులో ఐటెం సాంగ్స్ చేయ‌నున్న తెలుగు హీరోయిన్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 55 ఏళ్ల రమ్యకృష్ణ, ఈ మధ్యకాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇక అప్పట్లో తమిళ్ ఇటు తెలుగు హీరోలతో చాలా సినిమాలు చేశారు. అయితే అలాంటి అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ తాజాగా ఐటెం సాంగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మళ్లీ ఐటమ్ సాంగ్స్ చేయాలని ఉందని బాంబు పేల్చారు. జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో ద్వారా జగపతిబాబు అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకు జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ తరుణంలోనే రమ్యకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చి, తన అనుభవాలు, సినీ లైఫ్ విషయాలను పంచుకున్నారు. నువ్వు చేసిన వాటిలో ఏ సినిమా మరోసారి చేయాలనుకుంటున్నావు ? అని ఈ షో సందర్భంగా రమ్యకృష్ణను ప్రశ్నించాడు జగపతిబాబు. దీంతో వెంటనే ఆమె ఎవరు ఊహించని ఆన్సర్ ఇచ్చింది. సినిమా కాదు నేను గతంలో చేసిన ఐటమ్ సాంగ్స్ అన్ని మళ్లీ చేస్తాను అంటూ బాంబు పేల్చింది. దీంతో అక్కడే ఉన్న జగపతిబాబు టక్కున నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన సినీ ప్రియులు తమ స్టైల్లో స్పందిస్తున్నారు. 55 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story