ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు రామోజీ ఫిల్మ్ సిటీ.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా’(maa).

ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు రామోజీ ఫిల్మ్ సిటీ.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా’(maa). హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు విశాల్ ఫ్యూరియా(Vishal Furia) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రోనిత్ బోస్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా(Indranil Sengupta), ఖేరిన్ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'మా' చిత్రానికి అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం రామోజీ ఫిల్మ్ సిటీ అని తన జీవితంలో అక్కడికి వెళ్లనంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్స్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు కాజోల్ అంతలా భయపడటానికి అక్కడ ఏం చూసింది.. అని ఆలోచనలో పడ్డారు.

Twitter link

Next Story