Ranveer Deepika - Ram Charan: దీపిక - రణ్‌వీర్‌ సినిమాలో రాంచరణ్?

by Disha Web Desk 4 |
Ranveer Deepika - Ram Charan: దీపిక - రణ్‌వీర్‌ సినిమాలో రాంచరణ్?
X

దిశ, వెబ్‌డెస్క్: రణ్‌వీర్ సింగ్ సోమవారం ఇన్‌స్టా‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తళుక్కున మెరిశారు. రామ్ చరణ్‌తో పాటు త్రిష కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇవ్వని రణ్‌వీర్‌సింగ్ సిక్రెట్ త్వరలో బయటకు వస్తోందని సస్పెన్స్‌లో ఉంచారు. అయితే ఇది చూసిన నెటిజన్లు ‘ప్లీజ్ యాడ్ అని మాత్రం చెప్పొద్దు’ అంటూ రణ్‌వీర్‌సింగ్‌ను కోరుతున్నారు.

అయితే ఈ వీడియోలో పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న దీపిక పదుకోన్ పోలీసులతో ‘తన భర్త నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు’ అని చెబుతుంది. తర్వాత రణ్ వీర్‌సింగ్ ‘టార్గెట్ ఫౌండ్’ అంటూ సంభాషణలు సాగుతాయి. ‘ఏజెంట్ గో గో’ అని ఓ వాయిస్ రాగా రామ్ చరణ్ ఓ వ్యక్తిని చేజ్ చేస్తున్నట్లు ఆ వీడియలో ఉంది. త్రిష భయంతో పోలీసు స్టేషన్ ఎదుట నిలబడి ఉన్న వీడియో ఆసక్తి రేపుతోంది. జూలై 5న ఈ వీడియోపై క్లారిటీ ఇవ్వనున్నట్లు రణ్ వీర్ సింగ్ తెలిపాడు. ఈ వీడియోను రామ్ చరణ్, త్రిష, దీపికా పదుకోన్‌కు రణ్ వీర్ ట్యాగ్ చేశాడు.

Read More: ‘షో మీ ది సీక్రెట్’.. రామ్‌చరణ్-దీపికల వీడియో వైరల్


Next Story

Most Viewed