- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రామబాణం’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుంది: జగపతి బాబు
మంచి ఉద్దేశంతో చేసిన ‘రామబాణం’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుందంటున్నాడు జగపతిబాబు.

దిశ, సినిమా: మంచి ఉద్దేశంతో చేసిన ‘రామబాణం’ ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుందంటున్నాడు జగపతిబాబు. గోపిచంద్, శ్రీవాస్ కాంబోలో వస్తున్న ఈ మూవీ మే 5న విడుదల కాబోతున్న సందర్భంగా ఇందులో హీరోకు అన్నగా నటించిన జగపతిబాబు మీడియాతో ముచ్చటించాడు. ‘ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. మూవీలో అన్నదమ్ముల కాన్సెప్ట్ అద్భుతంగా కుదిరింది. సింగిల్ సెన్సార్ కట్ లేదు.
సెంటిమెంట్ తగ్గిపోయిన రోజుల్లో ఇలాంటి కథలు రావడం చాలా అవసరమని నా భావన. నెగిటివ్ రోల్స్ బలంగా చేస్తున్న సమయంలో మళ్లీ పాజిటివ్ రోల్స్ వైపు రావడం సంతోషంగా ఉంది. నాకు డబ్బు ప్రాధాన్యత కాదు. పాత్ర, సినిమా ముఖ్యం. రెమ్యూనరేషన్ కంటే ప్యాషన్ ఇంపార్టెంట్. భవిష్యత్తులో ‘గాడ్ ఫాథర్’ లాంటి పాత్ర చేయాలనుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన సినిమాలో డింపుల్ హయాతి కథానాయికగా నటించింది.






