- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు (Mahesh Babu)పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఉత్సాహాన్ని పెంచింది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ‘‘ఫైనల్లీ షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా... మనమందరం గర్వపడే ప్రాజెక్ట్ ఇది. నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్‌కి ధన్యవాదాలు. నవంబర్ 28న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మీ ముందుకు వస్తోంది’’ అని రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రామ్ అభిమానులు సంతోషపడుతున్నారు. కాగా.. ఇప్పుడు సినిమా టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషనల్ క్యాంపైన్‌పై ఫోకస్ చేస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






