- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కేసీఆర్ బయోపిక్ తీస్తా'.. క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
పొలిటికల్ బయోపిక్స్ తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన దర్శకుడు లేడు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన

దిశ, సినిమా : పొలిటికల్ బయోపిక్స్ తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన దర్శకుడు లేడు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన బయోపిక్స్‌ను తీయడంలో వర్మకు మంచి పట్టు ఉంది. గతంలో కూడా ఏదైనా సంఘటన జరిగినపుడు దానికి సంబంధించిన చరిత్రను సినిమా తీస్తున్నట్లు ప్రకటించడం వర్మకు అలవాటు. అంతేకాదు ముందు తన మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ఇష్టం ఉంటే ఆ సినిమాను తెరకెక్కిస్తాడు. ఇక అసలు విషయానికొస్తే అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చే పనిలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి






