ఎలాంటి అనౌన్స్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’

by Prasanna |
ఎలాంటి అనౌన్స్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’
X

దిశ, వెబ్ డెస్క్: ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.. అప్పట్లో ఓ ట్రెండును కూడా సెట్ చేసింది. ఆ సినిమాలోని పాటలు, డైలాగ్స్ , డ్యాన్స్ ఇలా ఒకటేంటి అన్ని సోషల్ మీడియాని ఊపేసింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ వచ్చింది.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ మూవీ మన ముందుకొచ్చింది. ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ తో పాటు సాయాజీ షిండే, ప్ర‌గ‌తి ముఖ్య నటులు నటించారు. ఈ మూవీ ఆగ‌స్టు 15న థియేటర్లోకి వచ్చింది. అయితే.. అంచ‌నాలు తారుమారు అయ్యాయి. బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే.. కలెక్షన్స్ కూడా సరిగా రాబట్టలేకపోయింది. మొదటి నుంచి ప్రమోషన్స్ లో కూడా మూవీ టీం చురుకుగా లేదు.

ఇక, ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి అనౌన్స్ లేకుండానే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.మ‌ల‌యాళం, క‌న్న‌డ, తెలుగు, త‌మిళం బాష‌ల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేట‌ర్ల‌లో చూడని వారు ఎంచ‌క్కా ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటూ.. ఓటీటీలో చూసేయండి.

Advertisement

Next Story

Most Viewed