Upasana-Ram Charan: భార్యకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. ఉపాసన రియాక్షన్ ఏంటంటే?

by Hamsa |
Upasana-Ram Charan: భార్యకు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. ఉపాసన రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: నేడు జూలై 21న మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన పుట్టిన రోజు. దీంతో భార్యకు గ్లోబల్ స్టార్ స్పెషల్ విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ఉపాసనతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేస్తూ.. ‘‘హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు వదిన పుట్టినరోజు శుభాకాంక్షలు అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ పోస్ట్‌కు ఉపాసన కూడా రిప్లై ఇచ్చింది. ‘‘ థాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ సూపర్’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ ఇద్దరి పోస్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుండటంతో గ్రేట్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ జంట లండన్ వెకేషన్స్‌లో కూతురు క్లిన్ కారాతో ఎంజాయ్ చేస్తున్నారు. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. అలాగే రామ్ చరణ్ ఓ అరుదైన ఘనత సాధించి తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా చేశారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివలక ఆఫ్ మెల్‌బోర్న్‌కు గెస్ట్‌గా మెగా హీరో వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అవార్డును తీసుకోబోతున్నాడు. అది కూడా తొలి భారతీయ సెలబ్రిటీగా ఈ వేడుకలకు హాజరవుతూ రికార్డు సృష్టించాడు.

(Video Link Credits To Ram Charan Instagram Channel)

Advertisement

Next Story