- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ విధ్వంసం.. నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్!
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే 100K డాలర్ల ($100,000) మార్కును దాటి ‘పెద్ది’ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సాధారణంగా ఏదైనా సినిమాకు ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్స్ జోరందుకుంటాయి.

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి రాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే 100K డాలర్ల ($100,000) మార్కును దాటి ‘పెద్ది’ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సాధారణంగా ఏదైనా సినిమాకు ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్స్ జోరందుకుంటాయి. కానీ ‘పెద్ది’ విషయంలో కేవలం రెండు పాటలు, రెండు చిన్న గ్లింప్స్ వీడియోలు మాత్రమే విడుదలయ్యాయి. అయినప్పటికీ, 24 గంటల లోపు అత్యధిక టికెట్లు అమ్ముడైన భారతీయ చిత్రంగా ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌డమ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు మేకింగ్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకమే ఈ అద్భుతమైన స్పందనకు కారణమని చెప్పవచ్చు.
ఈ స్థాయిలో స్పందన రావడం రామ్ చరణ్ క్రేజ్‌కి నిదర్శనం. అమెరికాలోని తెలుగు వారు చరణ్ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలే చెబుతున్నాయి. సినిమా మీద ఉన్న విపరీతమైన పాజిటివ్ బజ్ కారణంగానే కేవలం కొన్ని పోస్టర్లకే ఈ రేంజ్‌లో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. అమెరికాతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఊర మాస్ మేకోవర్, పల్లెటూరి నేపథ్యం ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్లో జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ 3వ తేదీనే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు పడనున్నాయి. చరణ్ కెరీర్‌లోనే ఇది మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.






