Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ డైరెక్టర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్-ఉపాసన.. వావ్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (పోస్ట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ డైరెక్టర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్-ఉపాసన.. వావ్ అంటూ నెటిజన్ల కామెంట్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. మరీ ముఖ్యంగా.. ఆయన అర్జున్ రెడ్డి(Arjun Reddy), యానిమల్(Animal) వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ రెండు మూవీస్ ఆయన రేంజ్‌ను మార్చాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit)చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఇందులో మొట్టమొదటిసారి ప్రభాస్ పోలీసుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ విషయంలో పెద్ద వివాదమే మొదలైందని చెప్పాలి. ముందు దీపికాను సెలెక్ట్ చేసుకుని కథ అంతా చెప్పాక ఏవో మనస్పర్థలు తలెత్తడంతో ఆమెను తొలగించేసి మరో హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేశాడు.

దీంతో ఆమె పీఆర్ స్టోరీ లీక్ చేయాలని చూస్తున్నారని సందీప్ రెడ్డి వంగా మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీపికాకు బదులుగా ప్రభాస్‌ సరసన నటించేందుకు తీసుకున్నారు. అంతేకాకుండా అధికారిక ప్రకటన కూడా చేయడంతో ఈ వివాదం కాస్త ముదిరింది. దీపికా, సందీప్ రెడ్డి వంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సందీప్ రెడ్డి వంగాకు ఓ స్టార్ కపుల్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టారు.

అయితే ఆయనకు రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana)అత్తమాస్ కిచెన్ నుంచి అవకాయ పచ్చడి జాడి పంపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అలాగే ఓ స్వీట్ నోట్ కూడా పంపడంతో ఆనందంతో ఉబ్బిపోయిన సందీప్ మెగా కపుల్‌కు థాంక్స్ చెప్తూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ సర్‌ప్రైజ్ టెస్టీగా చాలా బాగుంటుందని రాసుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story