అఖిల్‌పై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్.. అందుకేనా?

by Dishanational2 |
అఖిల్‌పై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్.. అందుకేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.దీంతో కొత్త ఉత్సాహంతో అఖిల్ కమ్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడంట. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఇదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అఖిల్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన ఫ్రెండ్‌ విక్రమ్‌తో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడంట. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన మొదటి ప్రాజెక్ట్ అఖిల్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. వీళ్లీద్దరు మంచి స్నేహితులు. కాగా, ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన కొత్త వెంచర్ గురించి తాజాగా మాట్లాడారు. వి మెగా పిక్చర్స్ లో తాము వైవిధ్యంతో కూడిన ఫ్రెష్ కంటెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు చెప్పారు.

Also Read: త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ పరోక్ష వ్యాఖ్యలు.. వైరల్!



Next Story

Most Viewed