Ram Charan : ఒకరు కాదు.. ఇద్దరు.. ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన చెర్రీ

by Disha Web Desk 10 |
Ram Charan : ఒకరు కాదు.. ఇద్దరు..  ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేసిన చెర్రీ
X

దిశ, సినిమా : టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేశాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తున్న చెర్రీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'మీ మొదటి క్రష్ ఎవరూ?' అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర జవాబిచ్చాడు. 'హాలీవుడ్‌ హీరోయిన్స్‌ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ఆమెను టీవీలో చూసినా, బిగ్‌ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలాగే ఉండిపోతా. ఆమె నన్ను చాలా ఆకర్షిస్తుంది. 'ప్రెట్టీ ఉమెన్‌' సినిమా చూశాక.. ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయా. నా మరో క్రష్‌.. కేథరిన్‌ జెటా జోన్స్‌. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది 'ది మార్క్‌ ఆఫ్‌ జోరో'. ఆ మూవీలో కేథరిన్‌ నటన నన్నెంతో ఆకట్టుకుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని చరణ్‌ను 'స్నాక్‌' అని అభివర్ణించగా.. పెద్దగా నవ్విన హీరో 'ఈ కామెంట్‌ నా వైఫ్‌ వింటే గర్వంగా ఫీలవుతుంది' అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు.

Next Story

Most Viewed