Ram Charan : వినాయకుని సన్నిధిలో అయ్యప్ప దీక్ష విరమించిన రామ్ చరణ్

by Phanindra |   (  Updated:2023-10-04 07:28:08  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాడనే విషయం తెలిసిందే

Ram Charan : వినాయకుని సన్నిధిలో అయ్యప్ప దీక్ష విరమించిన రామ్ చరణ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటాడనే విషయం తెలిసిందే. ఈ మాలలో ఉన్నప్పడు ఆయన ఎంతో నిష్టతో ఉంటాడు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్న రామ్ చరణ్ తన దీక్షను ముంబైలోని సిద్ధి వినాయకుని సన్నిధిలో విరమించాడు. అనంతరం అక్కడే ఓ యాడ్ షూట్‌లో పాల్గొని తిరిగి హైద్రాబాద్‌ వస్తాడని సమాచారం. ముంబై ఆలయంలో చెర్రీ పూజలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు చరణ్ ‘RRR’ సమయంలో కూడా అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయితే ఈసారి మాత్రం చెర్రీ తన కూతురు క్లిన్‌కారా కోసం మాల ధరించాడట.

Read More: సడెన్‌గా ముంబై వెళ్లిన రామ్ చరణ్.. ఎందుకంటే..?

Next Story