Naveen,Anushka కాంబోపై Ram Charan ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

by Disha Web Desk 7 |
Naveen,Anushka కాంబోపై Ram Charan ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన మూవీ.. సెప్టెంబర్-7 న వరల్డ్ వైడ్‌గా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు ఆడియెన్స్‌తో పాటు.. సెలబ్రిటీల ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీపై ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ మారుతి, వంశీ పైడిపల్లి, స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఈ మేరకు ‘‘ఇప్పుడే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. ఈ మూవీ ఆద్యంతం సరదాగా నవ్వులు పంచుతూ సాగింది. నవీన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా.. అనుష్క తన ఛార్మింగ్‌తో ఆకర్షించింది. ఈ సినిమాకు వీరిద్దరి జోడి పర్పెక్ట్ గా సెట్ అయింది. దర్శకుడు మహేశ్ బాబు.పి. నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, ఇతర టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశాడు. చర్రీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ‘జవాన్‌’ సక్సెస్‌మీట్‌‌కు హాజరుకాని నయనతార.. కారణం చెప్పిన షారుఖ్

Next Story

Most Viewed