అరుదైన అవకాశం దక్కించుకున్న రామ్ చరణ్.. ఆస్కార్‌ అకాడమీ పోస్ట్ వైరల్

by Hamsa |
అరుదైన అవకాశం దక్కించుకున్న రామ్ చరణ్.. ఆస్కార్‌ అకాడమీ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయనను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అకాడమీలోని యాక్టర్స్‌ బ్రాంచ్‌‌లో చేర్చుకున్నట్లు అకాడమీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టును పోస్ట్ చేసిన సదరు సంస్థ అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును కూడా అనౌన్స్ చేసింది. ఇక కొత్తగా 7 గురు నటులు యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చేరగా ఇప్పటికే ఇండియానుంచి తారక్‌ ఈ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు చరణ్‌ ఈ జాబితాలో చేరడంతో అభిమానులు ఫుల్‌ ఖుష్ అవుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇదిలావుంటే.. ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో కనిపించనుంది. హ్యారీ జోష్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌‌లో ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే యేడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

Next Story

Most Viewed