కొత్త ఫ్రెండ్‌ను ఇంటికి తెచ్చుకున్న Ram Charan.. పిక్స్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2023-10-03 15:30:10  IST  )

స్టార్ హీరో రామ్ చరణ్ కొత్త ఫ్రెండ్‌తో దర్శనమిచ్చి అభిమానులను అలరించాడు.

కొత్త ఫ్రెండ్‌ను ఇంటికి తెచ్చుకున్న Ram Charan.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్ కొత్త ఫ్రెండ్‌తో దర్శనమిచ్చి అభిమానులను అలరించాడు. సాధారణంగా గుర్రాలంటే చాలా ఇష్టపడే ఆయన ‘మగధీర’ సినిమా చేస్తున్నపుడు గుర్రాలతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. అంతేకాదు ఫ్రీ టైమ్ దొరికితే హార్స్ రేస్ ఈవెంట్స్‌కూ హాజరవుతుంటాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా మరో కొత్త గుర్రాన్ని తెచ్చుకున్నట్లు చెబుతూ సోషల్ మీడియా వేదికగా దానితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన చెర్రీ.. ‘BLAZE!! My new friend!’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుండగా ‘మా అన్నయ ఇండియా లోనే నెంబర్ 1 రైడర్. ‘గేమ్ ఛేంజర్’ మూవీలో దీన్ని యూజ్ చేయండి అన్నా’ అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.


Next Story