అవకాశాల కోసం ఆ పని చేయక తప్పలేదు.. అసలు విషయం చెప్పేసిన రకుల్ !

by Disha Web Desk 10 |
అవకాశాల కోసం ఆ పని చేయక తప్పలేదు.. అసలు విషయం చెప్పేసిన రకుల్ !
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. దాదాపు అందరు హీరోలతో జతకట్టి మంచి హిట్ అందుకుంది. కానీ ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్, అక్కడ కూడా సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను లీడ్ చేస్తోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్టింగ్‌లో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. రీసెంట్‌గా ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ తను హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గుర్తు చేసుకుంది. ‘హీరోయిన్ అవ్వాలనే గోల్‌తో ఒంటరిగా ముంబై వచ్చాను. లైఫ్‌లో నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. ఇక అవకాశాలు ఊరికే రావు కదా.. వాటి కోసం చాలా అడిషన్స్‌కి వెళ్లాను. క్యూలలో గంటల తరబడి నిల్చుండేదాన్ని, రోజూ క్యాస్టింగ్ ఏజెంట్స్‌కి, డైరెక్టర్లకు ఫోన్లు చేసేదాన్ని, ఆఫర్స్ దక్కినట్టే దక్కి చివరకు వేరే వాళ్లకు వెళ్లిపోయేవి. కానీ హీరోయిన్‌గా నా జర్నీ మాత్రం ఆపలేదు. పైగా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్న. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో ఈ స్థాయికి రాగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్.


Next Story