Rakul Preet Singh : మొత్తానికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకుల్ ..

by Dishafeatures1 |
Rakul Preet Singh : మొత్తానికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకుల్ ..
X

దిశ, సినిమా: దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందం... నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే పలువురు స్టార్ హీరోలతో జతకట్టి గ్లామర్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది.ఇక టాలీవుడ్ లో అవకాశాలు తగ్గబంతో, కొంతకాలంగా ఆమె బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టింది. ఓటీటీ, థియేట్రికల్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే రకుల్ పెళ్లి పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు మారుమోగుతూనే ఉన్నాయి.

కొంత కాలంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టింది. దాంతో ఆమె లవ్ ట్రాక్‌ అఫీషియల్ అయిపోయింది. అయితే తాజా రిపోర్ట్ ప్రకారం జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ వివాహం గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో ఫిబ్రవరి 21న జరుగనున్నట్లు సమాచారం. ఈ మేరకు సినీ ప్రముఖులు, స్నేహితులకు ఆహ్వానం కూడా అందిందట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


Next Story

Most Viewed