- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియాలో పనికి మాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ రకుల్ ప్రీత్‌సింగ్ ఫైర్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తెలుగు, తమిళ, హిందీలో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తెలుగు, తమిళ, హిందీలో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. వివాహం తర్వాత నుంచి అడపా దడపా సినిమాలు చేస్తోంది కానీ హిట్ అందుకోలేకపోతుంది. ఇటీవల ‘మేరే హస్సెండ్ కి బివి’(Mere Husband Ki Biwi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అలాగే తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్‌లు కూడా ఇస్తోంది.
తాజాగా, రకుల్ ప్రీతిసింగ్ సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాలోకి వచ్చింది. దురదృష్ణవశాత్తూ, మన దేశంలో చాలా మందికి ఎలాంటి పనిలేదు. వారందరికీ ఉచిత డేటా ప్లాన్‌లు అందుబాటులోకి ఉన్నాయి. అందుకే ఇతరుల జీవితాల గురించి చాలామంది కామెంట్స్ చేస్తూ సంతోషపడుతున్నారు. ఇతరులను మాటలు అని బాధ పెట్టడం తప్ప వారికి ఇంకేమీ పనిలేకుండా పోయింది. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతుండగా.. మరికొందరు మాత్రం తిడుతున్నారు.






