మిసెస్ అయిపోయిన స్టార్ హీరోయిన్.. కానీ పెళ్లి ఫొటోలు మాత్రం..!

by Disha Web Desk 7 |
మిసెస్ అయిపోయిన స్టార్ హీరోయిన్.. కానీ పెళ్లి ఫొటోలు మాత్రం..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి స్టార్ డమ్‌ని సొంతం చేసుకుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో రకుల్.. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన విషయం తెలిసిందే. గోవాలో స్టార్ట్ అయిన వీరి ప్రేమ, గోవాలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.

ఇక ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. హాల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరగ్గా.. ఈ రోజు మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో కన్నులపండుగగా ముగిసింది. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీని ఆశీర్వదించడానికి ప్రముఖ సినీ నటులు హాజరయినట్లు తెలుస్తోంది. కానీ, పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రానివ్వక పోవడం విశేషం.


Next Story