రక్షిత్ అట్లూరి హీరోగా ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ చిత్రం ప్రారంభం

by Dishafeatures2 |
రక్షిత్ అట్లూరి హీరోగా ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ చిత్రం ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రక్షిత్ అట్లూరి హీరోగా ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ చిత్రం ప్రారంభమైంది. గొల్లపాటి నాగేశ్వరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి క్లాప్ కొట్టగా.. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు గొల్లపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతోంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా. పోలీస్ నేపథ్యం లో ఈ సినిమా ఉండబోతోంది. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ’’ అని తెలిపారు.


హీరో రక్షిత్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఒక మంచి టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. ప్రొడ్యూసర్ విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ.. ‘‘మా డైరెక్టర్ ఒక కొత్త కాన్సెప్ట్ తో సరికొత్త కథాంశంతో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సినిమా స్టోరీ చాలా బాగుంది. త్వరలో మిగతా నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణల వివరాలు తెలియజేస్తాను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో యు అండ్ ఐ అధినేత పద్మనాభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

చిత్ర విశేషాలు

నటీనటులు: రక్షిత్ అట్లూరి

సాంకేతిక నిపుణులు :

బ్యానర్: మంత్ర ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ , రాజరాయ్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గొల్ల పాటి నాగేశ్వరావు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాలాజీ శ్రీను

పీఆర్ఓ: శ్రీపాల్ చొల్లేటి

Next Story

Most Viewed