నా కూతురిని అంటే నరికేస్తా.. రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో వైరల్

by Disha Web Desk 7 |
నా కూతురిని అంటే నరికేస్తా.. రాకేష్ మాస్టర్ చివరి సెల్ఫీ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోఖసంద్రంలో మునిగిపోయారు. రాకేష్ మాస్టర్ మరణం వెనుక అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాకేష్ మాస్టర్‌ది సహజ మరణం కాదని.. ఆయనను ఎవరో హత్య చేశారని అభిమానులు అనుమానించారు. మరుకొందరు అయితే అతని చావుకు అధికంగా తాగడమే కారణం అంటూ కామెంట్లు చేశారు. అయితే.. ఇన్ని రకాల అనుమానాల మధ్య రాకేష్ మాస్టర్ చనిపోయో ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో ఆధారంగా.. ‘‘తాను మద్యం సేవించి మాట్లాడుతున్న అని చాలా మంది అపోహ పడుతున్నారు. కానీ నేను చాలా నీరసంగా ఉన్నాను. చాలా రోజుల నుంచి కేవలం నీటిని మాత్రమే తీసుకుంటున్నాను. అందుకే చాలా వీక్‌గా ఉన్నాను. అలాగే ఆయన కొన్ని వీడియోలు చేయడానికి ఒప్పుకున్నాను. త్వరలో వాటి గురించి చెప్తా అని మాస్టార్ ఆ వీడియోలో చెప్పారు. కొందరు వీడియోల గురించి అతన్ని ఎంతలా ఇబ్బంది పెట్టారో ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఆయనతో సహజీవనం చేస్తున్న లక్ష్మీ వంటి వారి పేర్లు ప్రస్తావించారు. వీడియో చివరిలో వాళ్లు నా కూతురిని అన్నారు. నా కూతురిని ఎవరైనా ఏమైనా అంటే వారిని నరికేస్తా’’ అంటూ రాకేశ్ మాస్టార్ ఆవేదన చెందుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు ఆయనను తలచుకుంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed