Rakesh Master: మా నాన్నను చంపేశారు.. ఇక మా జోలికి రావొద్దు: రాకేష్ మాస్టర్ కొడుకు

by Chukka Sudharani |   (  Updated:2023-06-22 11:53:24  IST  )

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.

Rakesh Master:  మా నాన్నను చంపేశారు.. ఇక మా జోలికి రావొద్దు: రాకేష్ మాస్టర్ కొడుకు
X

దిశ, సినిమా: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి, ఆ తర్వాత ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి అంతే వేగంగా కిందకి పడిపోయాడు. ఇక ఆయన మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన చేసిన సేవలు, ఆయన మంచితనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మాస్టర్ కొడుకు చరణ్ వైరల్ కామెంట్స్ చేశారు. ‘రోజు రోజుకు మా నాన్న దిగజారిపోవడానికి కేవలం మీడియానే కారణం. ఇక చాలు ఆయనకు సంబంధించిన విషయాలు కానీ, మా కుటుంబ సభ్యుల జోలికి కానీ మీడియా వస్తే ఊరుకోను. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ కష్టాలు ఏంటి? చనిపోతే మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ వందసార్లు వేసి చూపిస్తూ మా జీవితాలు చీకట్లోకి లాగకండి’ అంటూ తిడుతున్నాడు చరణ్.

Also Read..

డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Next Story