‘రాకాస’ టీజర్ రిలీజ్..

by Mallepaka Hamsa |

నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అద్భుతంగా ఉంది.

‘రాకాస’ టీజర్ రిలీజ్..
X

దిశ, సినిమా: సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్ మీద నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో.. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అద్భుతంగా ఉంది. హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత టీజర్ పూర్తిగా కామెడీ జానర్‌లోకి మారిపోయింది. హీరో భయపడుతూ.. ‘స్త్రీ.. రేపు రా’ అనే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే కంప్లీట్ పవర్ ఫ్యాక్డ్ సినిమాలా కనిపిస్తోంది. టీజర్‌తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది. ఇక ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా, రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫర్‌గా పని చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.


Next Story