'కాంతారా' ప్రీక్వెల్‌లో సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

by Dishafeatures2 |
కాంతారా ప్రీక్వెల్‌లో సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి మూవీ 'కాంతారా' ప్రీక్వెల్‌ గురించి బిగ్‌ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిన్న చిత్రంగా రిలీజై ఊహించని రేంజ్‌లో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ప్రీక్వెల్‌లో తలైవా రజనీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్‌ శెట్టిని ఈ విషయం గురించి ప్రేక్షకులు అడగ్గా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవటం మరింత బలాన్ని చేకూర్చింది.

ఇది రూమర్‌ అయితే రిషబ్‌ తప్పకుండా స్పందించే వాడని, ఏమీ చెప్పకుండా విషయాన్ని దాచాడంటే రజనీ కనిపించడం ఖాయమనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ నెట్టింట 'హిట్‌ మూవీలో సూపర్‌ స్టార్‌' అనే హ్యాష్‌టాగ్‌ చక్కర్లు కొడుతుండటం విశేషం.



Next Story

Most Viewed