Rajinikanth: ఎంత ఎదిగిన మూలాలు మరిచిపోని రజనీకాంత్.. పిక్స్ వైరల్

by Vinod kumar |   (  Updated:2023-08-30 13:02:33  IST  )

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రపంచంలోని నలుమూలల ప్రతి ఒక్కరికి సుపరిచితమే.

Rajinikanth: ఎంత ఎదిగిన మూలాలు మరిచిపోని రజనీకాంత్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ప్రపంచంలోని నలుమూలల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో తన నటన, స్టైల్‌తో భారతదేశం గర్వించదగ్గ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. రజనీ ఎంతఎదిగినప్పటికీ ఎప్పుడు సింపుల్‌గానే ఉంటాడు. అయితే రజనీకాంత్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందు బస్‌ కండెక్టర్‌గా పని చేశారన్న సంగతి తెలిసిందే. ఆయన పని చేసింది మరెక్కడో కాదు బెంగళూరు, జయనగర బస్‌ డిపోలోనే. తాజాగా ఆయన జయనగర బీఎమ్‌టీసీ బస్‌ డిపోకు వెళ్లారు. అక్కడున్న వారిని సడెన్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. రజనీ అక్కడికి వస్తున్నట్లు ఎవరికీ తెలీదు. దీంతో ఆయన డిపోలోకి రాగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఆయన మాత్రం చాలా కూల్‌గా వారితో కొద్దిసేపు మాట్లాడి అందరితో ఫొటోలు దిగి సందడి చేశారు.

ఇవి కూడా చదవండి : Nagarjuna – Dhanush: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ధనుష్ ప్రాజెక్ట్‌లో నాగార్జున!

Next Story