ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్న రజినీ కాంత్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన హీరో శివ కార్తికేయన్

by Disha Web Desk 6 |
ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్న రజినీ కాంత్.. స్పెషల్ వీడియో షేర్ చేసిన హీరో శివ కార్తికేయన్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మావీరన్‌’. హీరోయిన్‌ అదితి శంకర్‌ నటించిన ఈ చిత్రం అశ్విన్‌ మడోన్‌ దర్శకత్వంలో శాంతి పిక్చర్స్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా శివకార్తికేయన్‌ తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో మావీరన్‌ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘జైలర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మావీరన్‌ చిత్రాన్ని చూడలేకపోతారేమోనని చాలా నిరుత్సాహపడ్డాను.

అయితే ఇటీవల మావీరన్‌ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌.. నాకు ఫోన్‌ చేసి చిత్రం చాలా బాగుందని అభినందించారు. ఇది నాతో పాటు యూనిట్‌ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. అలాగే మావీరన్‌ సినిమాను పూర్తిగా ఎంజాయ్‌ చేశానని, చాలా గ్రాండ్‌గా, సూపర్బ్‌గా ఉందని ఆయన ప్రశంసించారు. చాలా డిఫరెంట్‌ కథా చిత్రాలను ఎంచుకుంటున్నావు కదా అని అభినందించారన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమానిగా రజినీకాంత్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను రంగంలోకి ప్రవేశించినట్లు శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు

Read More: బ్రేకింగ్ న్యూస్: సినీ నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు..

Next Story

Most Viewed